Madhuri Rathod : ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ మరోసారి పోలీసుల తీరుపై మండిపడింది. ఫిర్యాదు చేసి16 రోజులైనా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నార్సింగి పోలీసులను ఆమె ప్రశ్నించింది. ఈమేరుకు సోమవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో మరోసారి స్టేట్మెంట్ ఇచ్చింది మాధురి. దాంతో.. 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామంటూ ఆమెతో పోలీసులు చెప్పారు.
జానపద గీతాల్లో సూపర్ డ్యాన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మాధురి రాథోడ్ తనకు న్యాయం చేయాలని మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె పోలీసులను నిలదీసింది. కంప్లైంట్ ఇచ్చి 16 రోజులైనా అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. మాధురి మరోసారి స్టేట్మెంట్ ఇవ్వడంతో 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామంటూ ఆమెతో పోలీసులు చెప్పారు. అంతేకాదుఈశ్వర్ సాయి, అతడి భార్య శరణ్య, సంధ్యా రాణిపై నార్సింగి పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నారు.
16 రోజులైనా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్టు చేయట్లేదని పోలీసులను ప్రశ్నించిన మాధురి రాథోడ్
నార్సింగి పోలీస్ స్టేషన్లో మరోసారి స్టేట్మెంట్ ఇచ్చిన మాధురి రాథోడ్
24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామంటూ చెప్పిన నార్సింగి పోలీసులు
ఈశ్వర్ సాయి, భార్య శరణ్య, సంధ్యా రాణిపై మరో కేసు… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/iLquPoLsoJ
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026