Donald Trump | ట్రంప్ బహిష్కరణ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన.. ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
Donald Trump | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడు (US President) గా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరులు అయినప్పటికీ కొందరిని బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడు (US President) గా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా పౌరులు అయినప్పటికీ కొందరిని బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆన్లైన్ వేదికగా నిరసనకారులు ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ‘ముందుగా మెలానియా ట్రంప్ (డొనాల్డ్ ట్రంప్ సతీమణి) ను బహిష్కరించాలి’ అని ఉన్న పిటిషన్‌కు అనుకూలంగా వేలమంది సంతకాలు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ మూవ్‌మెంట్‌ను పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ MoveOn.org ప్రారంభించింది.
సంతాకాల సేకరణ జరుగుతున్న పిటిషన్లో.. ‘సహజంగా పౌరసత్వం పొంది అమెరికా పౌరులుగా మారిన వారిని ట్రంప్ బహిష్కరించాలని భావిస్తున్నందున.. మెలానియా, ఆమె తల్లిదండ్రులను మొదట బయటకు పంపేయడం సరైందని భావిస్తున్నాం. బారన్ (ట్రంప్ చిన్న కుమారుడు) కూడా వెళ్లిపోవాలి. ఎందుకంటే ఆయన అమ్మమ్మ వేరే దేశంలో జన్మించారు. ట్రంప్ చెప్తున్నదాని ప్రకారం.. మీ అమ్మమ్మ అమెరికాలో జన్మించి ఉండాలి. కానీ మెలానియా తల్లి వేరే దేశంలో జన్మించారు. బయటకు పంపే విషయంలో మినహాయింపులు ఉండకూడదు. జాతీయ భద్రత, వలస అంశంలో ఉల్లంఘనల గురించి ట్రంప్ సీరియస్‌గా ఉన్నందున.. ట్రంప్ సొంత కుటుంబానికి మినహాయింపు ఇవ్వకూడదు. మెలానియా వెళ్లిపోవాలి’ అని పేర్కొన్నారు.
కాగా మెలానియా ట్రంప్ 1970లో యుగోస్లేవియాలో జన్మించారు. ఆమె అసలు పేరు మెలానిజా క్నావ్స్. మోడలింగ్‌లో కెరీర్‌ను వెతుక్కొంటూ 1996లో అమెరికా వచ్చారు. 2001లో గ్రీన్‌కార్డ్ పొందిన ఆమె.. 2006లో యూఎస్ పౌరురాలిగా మారారు. అమెరికా వెలుపల జన్మించిన రెండో ప్రథమ మహిళ ఆమె. ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో మోడలింగ్ కోసం మెలానియా యూఎస్ వచ్చినప్పుడు ఆమె చెల్లుబాటయ్యే వీసాను కలిగిఉన్నారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల లాస్ఏంజిల్స్లో జరిగిన ర్యాలీలో యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు మాగ్జిన్ వాటర్స్ కూడా ఇదే సందేహం వెలిబుచ్చారు. ఇక్కడ జన్మించిన వారి, వారి తల్లిదండ్రులను పత్రాలను ట్రంప్ పరిశీలించాలనుకుంటే.. ముందుగా ఆయన మెలానియాకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు.
Read More >>
‘ఐ లవ్ యూ’ చెప్పడం లైంగిక వేధింపు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
విమానంలో దూరిన పాము.. రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్
రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న ఆ కారు నాకొద్దు, ఫైన్ వేయండి.. పోలీస్ కమిషనర్‌కు మంత్రి లేఖ
హిమాచల్‌ప్రదేశ్‌కు కేంద్రం సవతితల్లి ట్రీట్మెంట్ : ఖర్గే
అతను నన్ను నాశనం చేయలేడు.. ఎందుకంటే.. : మహ్మద్ షమీ మొదటి భార్య హసిన్
పేపర్ చదువుతూ కూర్చోగా మీదపడ్డ చెట్టు.. ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

