అంతరిక్ష కేంద్రానికి చేరిన… తొలి ప్రైవేట్ వ్యోమగామి బృందం
వాషింగ్టన్: చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేట్ వ్యోమగాలి బృందం నింగిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరింది. దీంతో అందులోని వ్యోమగాములు వీరిని ఆహ్వానించారు. అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ యాక్సియమ్ స్పేస్ ఇంక్‌కు చెందిన నలుగురు ప్రతినిధుల బృందం శుక్రవారం నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లారు. 21 గంటల తర్వాత శనివారం ఉదయం 8.30 గంటలకు వీరు ఉన్న డ్రాగన్ క్యాప్సుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు డాక్ అయ్యింది. అనంతరం వారు అందులోకి ప్రవేశించారు.
యాక్సియమ్ బృందానికి చెందిన నలుగురు ఎనిమిది రోజులు అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. ఆ కంపెనీ వ్యాపార అభివృద్ధి ఉపాధ్యక్షుడు, స్పానిష్కు చెందిన 63 ఏండ్ల నాసా రిటైర్డ్ వ్యోమగామి మైఖేల్ లోపెజ్ అలెగ్రియా ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన సెకండ్ ఇన్ కమాండర్‌గా లారీ కానర్ వ్యవరిస్తున్నారు. 70 ఏండ్ల కానర్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు. ఓహియో నుంచి మిషన్ పైలట్‌గా నియమితమైన ఏరోబాటిక్స్ ఏవియేటర్.
ఇన్వెస్టర్, ఇజ్రాయెల్ మాజీ ఫైటర్ పైలట్, 64 ఏండ్ల ఐటాన్ స్టిబ్బేతోపాటు కెనడియన్ వ్యాపారవేత్త, 52 ఏండ్ల మార్క్ పాథీ ఈ బృందంలో ఉన్నారు. వీరిద్దరు కూడా మిషన్ నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బృందం వారంపాటు అక్కడ ఉండి ప్రయోగాలు చేయనున్నది. కాగా, తొలిసారి ప్రైవేట్ వ్యక్తులతో కూడిన ఈ సైన్స్ మిషన్ వాణిజ్యపరంగా అంతరిక్షయానంలో ఒక మైలురాయిగా నిలువనున్నది.
🚀 A SpaceX rocket ship, carrying the first all-private astronaut team to the International Space Station, arrived safely at the orbiting research platform https://t.co/TPqkiDK574 pic.twitter.com/b4UrsCfLMh
— Reuters (@Reuters) April 10, 2022
The #Ax1 mission from @Axiom_Space with four astronauts aboard the @SpaceX Dragon Endeavour docked to the station today at 8:29am ET. https://t.co/yuOTrYN8CV pic.twitter.com/FaoRTrKSKC
— International Space Station (@Space_Station) April 9, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

