వాషింగ్టన్: ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు. ఇది మనిషి మెదడులోని సహజ కణజాలం లాగా పనిచేయగలదని ‘న్యూరోసైన్స్’ జర్నల్ తాజా కథనం పేర్కొన్నది. కృత్రిమంగా తయారుచేసిన ‘త్రీడీ ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ’ నాడీ సంబంధిత సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో సైంటిస్టుల పరిశోధనకు ఇదెంతగానో దోహదపడుతుందని తెలిపారు. మానవ మెదడులో కణజాలం పనితీరును అర్థం చేసుకోవటంలో ఇది శక్తివంతమైన మోడల్ అవుతుందని పరిశోధకులు తెలిపారు.