Viral Video | చిలీలోని టాల్కా నగరంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పైలట్‌ను ఫెర్నాండో సోలన్స్ రోబెల్స్(58)గా గుర్తించారు.
ప్రమాదానికి గురైన విమానాన్ని ఫైర్‌ఫైటర్ ప్లేన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదాన్ని చిలీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మృతి చెందిన పైలట్ నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్లో పని చేస్తున్నారు. ఈ ఫైర్‌ఫైటర్ విమానం అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో కారులో వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#Maule #Chile🇨🇱- One person killed while four others injured after plane crashes and ignites truck fire at kilometer 247 of Route 5 South in #Talca; CONAF reports (📹@bayron_lopez01) pic.twitter.com/R9Hbv7q7WN
— CyclistAnons🚲 (@CyclistAnons) January 16, 2024