టోక్యో: జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టోక్యో ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదానికి గురైంది. హై స్పీడ్‌లో రన్‌వేపై దిగిన ఆ విమానంలో తీవ్ర స్థాయిలో మంటలు వ్యాపించాయి. విమానంలో కూర్చుకున్న ప్రయాణికులు కొందరు కిటికీల నుంచి ఆ ఘటనకు చెందిన వీడియో తీశారు. మంటల వల్ల విమానంలో పొగ కమ్ముకున్నది. ఆ సమయంలోనూ కొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లతో వీడియో తీశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#BreakingNews : First visuals from inside the wrecked plane who caught fire at Tokyo International airport #Japan .
People can be heard screaming.#Tsunami #earthquake pic.twitter.com/GnXNYuaCHk— Hsnain🍄 (@Hsnain901) January 2, 2024
అయితే ఆ విమానంలో మొత్తం 367 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు తోడు సిబ్బంది కూడా ఉన్నారు. రన్‌వేపై దిగుతున్న సమయంలోనే అక్కడ ఉన్న కోస్టు గార్డు ప్లేన్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚:#JapanAirlines (JAL) Airbus A350-900 (JA13XJ) caught fire on the runway after landing at #Tokyo Haneda Airport. Reports are saying that the #Airbus collided with a Coast Guard plane. Flight #JL516 departed from Sapporo.#JAL #Japan #A350 pic.twitter.com/bPOziMoob9
— Khalid . a . shelwan (@i_kk10) January 2, 2024
విమానం ఆగిన తర్వాత కొందరు ప్రయాణికులు ఆ మంటల నుంచి తప్పించుకుంటూ పరుగులు తీశారు. ఆ దృశ్యాలు కూడా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం జపాన్ విమానాశ్రయంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
సోమవారమే భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టం జరిగింది. అనేక ప్రదేశాల్లో రోడ్లు, మెట్రో స్టేషన్లు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య 48కి దాటింది. అయితే ఇవాళ విమాన ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. కొన్ని ఏజెన్సీలు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వార్తలను ప్రచురిస్తున్నాయి.