Massive Explosion | ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఈ పేలుడులో ఇప్పటివరకు ఈ ఘనటలో నలుగురు మృతి చెందగా.. 500 మంది వరకు గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బందర్ అబ్బాస్ నగరంలోని రాజాయ్ ఓడరేవులో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పేలుడుతో పెద్ద ఎత్తున పొగ ఈ ప్రాంతాన్ని కమ్మేసింది. రాజాయ్ ఓడరేవు ఇరాన్ ఓడరేవుల్లో ఒకటి.
لحظه #انفجار در بندر شهید رجایی #بندرعباس pic.twitter.com/aal6HkQmHJ
— خبرگزاری ایسنا (@isna_farsi) April 26, 2025
పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌తో అనుబంధంగా ఉన్న సినా కంటైనర్ యార్డ్‌లో శనివారం పేలుడు జరిగిందని ఇరాన్ కస్టమ్స్ అథారిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. పేలుడు కారణంగా ఓ భవనం కుప్పకూలిపోయింది. ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రాథమిక నివేదిక ప్రకారం.. సంఘటనా స్థలంలో మండే గుణం ఉన్న పదార్థాలు ఉన్నాయని.. నిల్వలో నిర్లక్ష్యం వహించడమే ఈ పేలుడుకు కారణమని పేర్కొంది. పోర్ట్‌లో జరిగిన ఈ భారీ పేలుడు కారణంగా ఓ భవనం కూలిపోయిందని తెలుస్తున్నది. కిలోమీటర్ల దూరం పాటు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. పలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం.
A blast occurs at Shahid Rajaee Port in Bandar Abbas, southern Iran
Check back shortly for more information.https://t.co/N6JwJ31Lnh pic.twitter.com/ElKUo142H8
— IRNA News Agency (@IrnaEnglish) April 26, 2025
تصاویری از حجم آتشسوزی در اسکله شهید رجایی pic.twitter.com/Tfer7zLAvh
— خبرگزاری ایسنا (@isna_farsi) April 26, 2025