హాంకాంగ్: హాంకాంగ్ ఆకాశహర్మ్యాల్లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 83కు చేరుకుంది. మరో 300 మందికి పైగా గల్లంతయ్యారు.
గత ఆరు దశాబ్దాల కాలంలో ఇదే భారీ అగ్నిప్రమాదమని అధికారులు తెలిపారు. భవనాలకు ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని, వాటి కోసం ఎక్కువగా వెదురు స్కా ఫోల్డింగ్, ఫోమ్ పదార్ధాలు వాడటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.