సియోల్: దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ఫైటర్ జెట్(Fighter jets) విమానాలు.. ప్రమాదవశాత్తు జనంపై బాంబులను జారవిడిచాయి. సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. రెండు ఫైటర్ విమానాలు.. సుమారు 8 బాంబులను విడిచినట్లు తెలుస్తోంది. నార్త్ కొరియా బోర్డర్ సమీపంలో ఉన్న పొచియాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఫోర్స్ కేఎఫ్-16 విమానం ఈ విన్యాసాల్లో పాల్గొన్నది. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టినట్లు దక్షిణ కొరియా వైమానిక దళం పేర్కొన్నది. నష్టం జరిగినందుకు క్షమాపణలు చెప్పింది. గాయపడ్డవారికి నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. సైనిక విన్యాసాల్లో లైవ్ ఫైరింగ్ చేయడం వల్ల జనావాస ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
స్థానిక మీడియా ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి మెడలో, మరొకరికి భుజానికి బుల్లెట్లు దిగాయి. ఎంకే-82 బాంబులకు చెందిన 8 షెల్స్‌ను తమ ఫైటర్ విమానాలు జారవిడిచినట్లు ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఓ విమానానికి చెందిన పైలట్ పొరపాటున జనావాస ప్రాంతంలో బాంబులను డ్రాప్ చేసినట్లు మిలిటరీ తెలిపింది. అయితే రెండో విమానం ఎందుకు తమ బాంబులను డ్రాప్ చేసిందో విచారణలో తేల్చాల్సి ఉందన్నారు. అన్ని రకాల లైవ్ ఫైరింగ్ విన్యాసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
🇰🇷 SOUTH KOREA ACCIDENTALLY BOMBS ITSELF!
A KF-16 fighter jet accidentally dropped eight MK-82 bombs on houses and a church, Yonhap news agency reports.
The bombs fell in a residential area of the city of Pocheon, injuring seven people, four of whom are in serious condition.… pic.twitter.com/YJ6eoWBnke
— Lord Bebo (@MyLordBebo) March 6, 2025