జెరూసలేం, మే 17: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 146 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళం కురిపించిన బాంబుల వర్షంలో తీవ్ర ప్రాణనష్టం సంభవించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. గత 24 గంటల్లో జరిగిన దాడుల్లో 459 మంది పౌరులు గాయపడ్డారని పేర్కొన్నది. విస్తృతమైన దాడులు, దళాల సమీకరణ నిర్వహిస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది.