Today History: తన గెరిల్లా సైనికులతో కలిసి ఫిడెల్ కాస్ట్రో 1959 లో సరిగ్గా ఇదే రోజున క్యూబాను హస్తగతం చేసుకున్నాడు. నియంత బాటిస్టాను అధికారం నుంచి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాడు. ఇది క్యూబా రాజకీయ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. దాదాపు 49 సంవత్సరాల పాటు క్యూబాలో అధికారాన్ని కొనసాగించాడు. ఈయన సోదరుడు రౌల్ కాస్ట్రో కూడా 12 ఏండ్లపాటు క్యూబా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఫిడెల్ కాస్ట్రో 1926 ఆగస్టు 13న జన్మించాడు. క్యూబాలో నియంత బాటిస్టా అణచివేతను అంతం చేయడానికి ఫిడెల్ కాస్ట్రో 1953 జూలై 26 న తన సోదరుడు రౌల్ కాస్ట్రోతో కలిసి కొద్దిమంది వ్యక్తుల సాయంతో కొన్ని ఆయుధాలతో తిరుగుబాటు చేపట్టాడు. ఫిడెల్ కాస్ట్రో తన కొద్దిమంది సైనికులతో కలిసి 1959 జనవరి 1 న బాటిస్టా నియంతృత్వాన్ని ముగించారు. బాటిస్టా తర్వాత క్యూబాలో ఫిడెల్ శకం మొదలైంది. ఫిడెల్ 1959 నుంచి 2008 వరకు క్యూబాలో అధికారంలో ఉన్నాడు.
1959 నుంచి 1976 వరకు ప్రధానమంత్రిగా, 1976 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1961 నుంచి 2011 వరకు క్యూబా కమ్యూనిస్ట్ పార్టీకి తొలి కార్యదర్శిగా ఉన్నారు. ఫిడెల్ కాకుండా అతడి సోదరుడు రౌల్ కాస్ట్రో కూడా 12 సంవత్సరాల పాటు క్యూబా అధ్యక్షుడిగా కొనసాగారు.
అధికారంలోకి వచ్చేంత వరకు అమెరికా మద్దతు పొందిన ఫిడెల్ క్యాస్ట్రో.. అధికారంలోకి వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ వైపు మొగ్గుచూపాడు. దాంతో క్యూబాతో అమెరికాకు దాదాపు 55 ఏండ్ల పాటు వైరం కొనసాగింది. ఈ కాలంలో కనీసం అమెరికా అధ్యక్షుడెవరూ క్యూబాలో అడుగుపెట్టలేదు. 2015 లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఫిడెల్ కాస్ట్రోను చంపేందుకు అమెరికా దాదాపు 600 సార్లు ప్రయత్నించి విఫలమైంది. విషపూరిత సిగార్, విషంతో నిండిన పెన్ను.. ఇలా ఎన్నో రకాలుగా ఫిడెల్ను హత్య చేసేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ కుట్రపన్నింది. చివరకు ఫిడేల్ మాజీ ప్రియురాలుతో చంపించేందుకు ఒప్పందం చేసుకుని కూడా విఫలం చెందారు. చివరకు 90 ఏండ్ల వయసులో 2016 నవంబర్ 25 న ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు.
2002: యూరోపియన్ యూనియన్లో అమలులోకి యూరో కరెన్సీ
2001: కలకత్తా పేరును అధికారికంగా కోల్కతాగా మార్పు
1995: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రారంభం
1978: బొంబాయిలో ఎయిర్ ఇండియా బోయింగ్-747 విమానం కూలి 213 మంది దుర్మరణం
1978: నటి విద్యాబాలన్ జననం
1971: భారత్లో టీవీ, రేడియోలలో సిగరెట్ ప్రకటనల ప్రదర్శనపై నిషేధం విధింపు
1971: గ్వాలియర్ రాజు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జననం
1961: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జననం
1951: నటుడు నానా పటేకర్ జననం
1950: ప్రసిద్ధ ఉర్దూ కవి, గీత రచయిత రహత్ ఇండోరి జననం
1941: ప్రముఖ హాస్యనటుడు అస్రానీ జననం
1906: ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ) విధానాన్ని గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం
1862: భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమలు
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..