న్యూయార్క్: ఏపీ మహిళ శశికళ నర్రా, ఆమె కుమారుడు అనీష్ నర్రాల హత్య కేసులో నిందితుడు నజీర్ హమీద్ (38)ను అరెస్ట్ చేయడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి రూ.45.10 లక్షలు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. 2017 మార్చిలో న్యూజెర్సీలోని మేపిల్ షేడ్‌లో శశికళ, అనీష్ హత్యకు గురయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హమీద్‌పై కేసు నమోదైంది. నిందితుడు అమెరికా నుంచి పారిపోవడంతో, అతనిని అమెరికాకు తిరిగి తీసుకుని రావడంపై ఎఫ్‌బీఐ దృష్టి పెట్టింది.