జెరూసలెం : పాపులర్ వెబ్ సిరీస్ ఫౌడాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న ఇజ్రాయెల్ నటి, డ్యాన్సర్, మోడల్ రోనా లీ షిమన్ హమాస్‌పై (Hamas Attack) పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తన దేశంపై ఉగ్ర మూక హమాస్ దాడిని వ్యతిరేకించేందుకు ప్రతిన బూనానని పేర్కొంది. హమాస్ దాడుల్లో అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ విజయం సాధించేలా హమాస్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏఎన్ఐ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి వెల్లడించింది. హమాస్ అమానుష దాడి నేపధ్యంలో భారత్ వంటి దేశాలు తమకు బాసటగా నిలవడం భరోసా ఇచ్చిందని, భారతీయులంటే తనకు ఎంతో అభిమానమని, ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ దాడిని ముందుగా భారత్ ఖండించిందని నటి గుర్తు చేసింది.
తాము యుద్ధం మధ్యలో ఉన్నామని, రాబోయే రోజుల్లో ఎన్నో జీవితాలు ముగిసిపోతాయని తెలిసినా తాము మనుగడ సాగించాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్‌ను కాపాడుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ బందీలను తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించడమే తమ తొలి ప్రాధాన్యతని షిమన్ తెలిపింది.
Read More :
Agniveer | అగ్నివీరుడి అంత్యక్రియలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఆర్మీ