Famous Ganesha Temples | భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆదిదైవం. పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను దేశ ప్రజలు ఎంతో వైభవంగా, ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. కుల మతం భేదం లేకుండా హిందూవులతో పాటు ముస్లింలు కూడా కలిసిఉండి ఈ పండుగను జరుపుకుంటారు.
వినాయక చవితి రోజున దేశంలోని ప్రముఖ గణేష్ ఆలయాలు అంగరంగ వైభవంగా అలంకరించబడతాయి. ఉదాహరణకి ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయం, కేరళలోని మయూర్ మహాగణపతి దేవాలయం, గణేష్ టోక్ టెంపుల్ గంగ్టక్, తమిళనాడులోని పిళ్లయార్ టెంపుల్, ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం గణపయ్య, త్రినేత్ర గణేష్ రణతంబోర్ వంటి ఆలయాలు ప్రసిద్ధి పొందాయి. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వినాయకుడిని దేవుడిగా పూజిస్తారు.
తమిళంలో వినాయకుడిని పిళ్లయార్ అంటారు. శ్రీలంకలో అరియాలై సిద్ధివినాయకర్ దేవాలయం, కటరగామ దేవాలయం ముఖ్యమైనవి. శ్రీలంక భక్తులతో పాటు భారతదేశం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు.
నేపాల్, భారతదేశానికి పక్కనే ఉన్న దేశం. అత్యధిక హిందువులు నివసించే దేశంలో భక్తపూర్ జిల్లా, ఖాట్మండు సరిహద్దులో సూర్యవినాయక దేవాలయం ఉంది. ఇది ఖాట్మండులోయిలోని నాలుగు ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి. జలవినాయక గణేష దేవాలయం కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందింది.
మలేషియాలోని సెలంగోర్‌లోని పెటాలింగ్ సమీపంలో ఈ ఆలయం ఉంది. పీజే పిళ్లైయార్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా తమిళ ప్రజలు ఎక్కువగా పూజలకు వస్తారు.
ఇక్కడ గణేశుడి విగ్రహాలు చాలానే ఉన్నాయి. హువాయ్ క్వాంగ్ స్క్వేర్‌లోని గణేశ దేవాలయం ప్రముఖమైంది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించేందుకు వస్తారు.
డెన్ హెల్డర్లో ఉన్న శ్రీ వరతరాజ సెల్వవినాయకర్ ఆలయం యూరోప్‌లో ప్రసిద్ధి చెందింది. 1991లో శ్రీలంక నుంచి వచ్చిన తమిళులు దీన్ని నిర్మించారు. హిందూయిజం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేందుకు ఈ ఆలయం సేవలందిస్తోంది.
హిందూ విశ్వాసం ప్రకారం వినాయకుడు మొదటి పూజలందుకునే దేవుడు. కానీ, మయన్మార్‌లో గణేషుడిని బ్రహ్మదేవుడిగా భావిస్తారు. ఈ దేశంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
ఇండోనేషియా ముస్లిం దేశం. ముస్లిం దేశమైనప్పటికీ గణపతిని ఇక్కడ గౌరవిస్తారు. బాలి దీవిలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాసంస్థ, నిర్మాణ సంస్థల్లో వినాయక విగ్రహాలు ఉంటాయి. ఇండోనేషియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మ ఉంది. ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.
అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో వినాయక ఆలయం ఉంది. మహావల్లభ వినాయక దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఫ్లషింగ్ టెంపుల్‌గా పిలుస్తుంటారు. ఈ దేశంలోనూ అనేక ప్రదేశాల్లో దేవాలయాలు సైతం ఉన్నాయి.