Maharashtra | ముంబై : కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టుగా ఇప్పటికే నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం మార్కెట్లో దర్శనమిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుండగా, ఇప్పుడు మార్కెట్లను నకిలీ వెల్లుల్లి కూడా ముంచెత్తనుంది. సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి మహారాష్ట్రలోని అకోలాలో దర్శనమివ్వడంతో ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కన్పిస్తున్న వెల్లిగడ్డను చూస్తే మామూలు వెల్లిగడ్డలానే కన్పించింది.
అయితే దాని రేక ఒకటి తీసి చూడగా, లోపలి భాగమంతా సిమెంట్‌తో నిండి గట్టిగా ఉండటం చూసేవారికి షాక్‌ను కలిగిస్తున్నది. వెల్లిగడ్డ పై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్‌ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్‌తో చేసిన నకిలీ వెల్లుల్లి అసలు స్టాక్‌లో కలిపి అమ్మేస్తున్నారని అనుమానిస్తున్నారు.
పోకిరీల స్టంట్లతో విసుగెత్తి..
బెంగళూరు: బైక్ విన్యాసాలు చేస్తున్న వారిపై విసుగు చెందిన ప్రయాణికులు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 15న బెంగళూరులోని అదకమరనహళ్లి దగ్గర రద్దీగా ఉండే 48 జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తున్న బైకర్లపై ఆగ్రహం చెందిన కొందరు ప్రయాణికులు మూడు బైక్‌లను ఫ్లె ఓవర్ నుంచి కిందకు తోసేశారు. బైక్ విన్యాసాలపై జూన్ వరకు ట్రాఫిక్ పోలీసులు 225 కేసులను నమోదు చేశారు. ఇప్పటివరకు బైక్ విన్యాసాలు చేసిన 9 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. గత రెండేండ్లలో బైక్ విన్యాసాలపై 552 కేసులు నమోదయ్యాయి.