న్యూయార్క్: అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం(F-35 Crash) కుప్పకూలింది. ఈ ఘటన అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. ఆకాశంలో విన్యాసం చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా ఎఫ్-35 కిందకు జారింది. విమానాశ్రయ రన్‌వేపై పడి పేలిపోయింది. ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. రన్‌వేపై కూలడంతో జెట్ పూర్తిగా ధ్వంసమైంది.
🚨#BREAKING: Watch as a F-35 fighter jet crashes at Eielson Air Force Base
⁰📌#Fairbanks | #AlaskaWatch as Military emergency crews quickly responded after an F-35 fighter jet crashed on the flightline at Eielson Air Force Base in Fairbanks, Alaska, as reported by a military… pic.twitter.com/v894H7YWDc
— R A W S A L E R T S (@rawsalerts) January 29, 2025
ఆ యుద్ధ విమానంలో ఉన్న పైలెట్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. అతన్ని బాసెట్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బేస్ పరిధిలోనే దుర్ఘటన చోటుచేసుకున్నది. ఎమర్జెన్సీ, అంబులెన్స్ సర్వీసులు వేగంగా స్పందించాయి. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.