లండన్, నవంబర్ 18: ల్యాబ్‌లో కండ్లను పుట్టించి అద్భుతాన్ని చేశారు యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు. ఉషర్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల నుంచి సేకరించిన ముల్లర్ కణాలను ప్రోగ్రామింగ్ చేసి మూల కణాలను సృష్టించారు. ఆ కణాలను 9 నెలల పాటు ల్యాబ్‌లో ఉంచి రెటీనాలా పెరిగేలా చేసారు. అలా కణాలన్నీ చిన్న పాటి (1 మిల్లీ మీటర్) కండ్లుగా మారాయి.