న్యూయార్క్, జూన్ 13: ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న రోగుల్లో ధూమపానం కంటే నిద్రలేమి సమస్య తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. మంచి నిద్ర ఉన్నవారితో పోల్చుకుంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ) ఉన్న రోగుల్లో నిద్రలేమి వల్ల ఊపిరితిత్తుల్లో ఆరోగ్య సమస్యలు 95 శాతం అధికంగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ఫ్రాన్సిస్కో పరిశోధకులు వెల్లడించారు. దీంతో కాలక్రమేణా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు సమస్య తీవ్రతరం అవుతుందని, కోలుకోలేని విధంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని పేర్కొన్నారు.