ఇస్లామాబాద్: తోషఖానా-2, అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 17 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2021మేలో అధికార పర్యటన నిమిత్తం సౌదీకి వెళ్లిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు సౌదీ రాజు ఖరీదైన బుల్గారీ నగలను బహూకరించారు. ఆ తర్వాత ఈ నగలను తక్కువ ధరకు ఇమ్రాన్ ఖాన్ దంపతులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.