Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ అవినీతి, అడ్డుగోలు నిర్ణయాలపై యువత కదం తొక్కింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో జన్-జడ్ (Gen Z) నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలే లక్ష్యంగా నిరసనకారులు దాడులకు పాల్పడుతున్నారు. ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప్రైవేట్ నివాసాలతో పాటు సుప్రీం కోర్టుకు సైతం నిప్పెట్టారు.
❗️ Nepal’s Former PM Sher Bahadur Deuba and His Wife – Current FM Arzu Rana Deuba – Left Bloodied & Dazed amid Mass Protests#Kathmandu #Nepal pic.twitter.com/LFVsJ52WFc
— RT_India (@RT_India_news) September 9, 2025
ఈ క్రమంలో ఆ దేశ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) నివాసాన్ని ముట్టడించిన వేలాది మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. బహదూర్ దేవుబా, ఆయన భార్య, నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా (Arzu Rana Deuba)పై విచక్షణా రహితంగా దాడి చేశారు. మాజీ ప్రధానిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కర్రలతో చితకబాదారు. ఆయన భార్య అర్జు రాణా దేవుబాపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ సైన్యం అతికష్టం మీద అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Sher Bahadur deuba escorted by the army https://t.co/JLuM9DOhqK pic.twitter.com/Ilv3Ji9Qhe
— Lørd (@lord1769) September 9, 2025
Ex Prime Minister of Nepal Sher Bahadur Deuba’s house pic.twitter.com/ASOFnQ44jF
— The_bahunn (@The_bahunn) September 9, 2025
Nepal Ex PM Sher Bahadur Deuba and his wife & Foreign Minister Arzu Rana Deuba captured and manhandled by GenZ protesters. #Nepalprotest mirrors Bangladesh now.#NepalGenZProtest #NepalProtests pic.twitter.com/QDKyiw554D
— Ganesh (@me_ganesh14) September 9, 2025
Former PM of Nepal Sher Bahadur Deiba and his wife who is the current Foreign Minister of Nepal Arzu Rana Deuba being dragged out of their residence.#NepalProtests #GenZProtest pic.twitter.com/PFsznIHOzh
— Karma 覚 (@iambhutia) September 9, 2025
Also Read..
Nepal | నేపాల్లో కర్ఫ్యూ.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు : సైన్యం
Health Minister | విలేకరుల సమావేశంలో కుప్పకూలిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి.. షాకింగ్ వీడియో
మంటల్లో హిమాలయ దేశం.. నేపాల్లోఉధృతమైన జనరేషన్ జెడ్ ఆందోళనలు