White House | అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్ హౌస్ (White House)ను చూడాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఈ వార్త. వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్ ప్రెస్ సెక్రటరీ (US press secretary) కరోలినా లీవిట్ (Karoline Leavitt) అందరికీ చూపించారు. ఈ మేరకు ఓ వీడియో పంచుకున్నారు.
Behind the scenes at the White House with @PressSec ‼️
This is awesome!!! pic.twitter.com/z54L9rCxah
— TONY™ (@TONYxTWO) May 1, 2025
ఆ వీడియోలో ముందుగా లీవిట్ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత వైట్హౌస్లోపలికెళ్లి వీడియో చిత్రీకరించారు. ప్రెస్ సభ్యులు సమావేశమయ్యే ప్రాంతం, అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబం నివసించే వెస్ట్ వింగ్ సమీపంలోని భవనాన్ని చూపించారు. అందులోని విశాలమంతమైన గదులు, ఫర్నిచర్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, అమెరికా అధ్యక్షుడికి సకల సౌకర్యాలు అందుతాయి. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు నివసించేందుకు అత్యంత విలాసవంతమైన అధికారిక భవనం శ్వేత సౌధం ఉంటుంది. దాన్ని వైట్ హౌస్ అని కూడా అంటారు. ఇందులో అధ్యక్షుడి కుటుంబం మొత్తం నివసించొచ్చు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం విస్తరించి ఉంటుంది. ఇందులో వంట, ఇతర పనుల కోసం దాదాపు 100 మంది సహాయకులు ఉంటారు. ఇక అధ్యక్షుడికి భోజనాలు తయారు చేసేందుకు ప్రపంచంలోనే టాప్ షెఫ్‌లు ఉంటారు. ఈ భవనం బయటి నుంచి చూస్తేనే పాలరాతి కట్టడంలా అనిపిస్తుంది. ఇక లోపల ఎంతో విశాలమంతమైన గదులు, ఖరీదైన ఫర్నిచర్ ఉంటాయి.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన