కీవ్: ఉక్రెయిన్ భయపడినట్టుగానే..ఆ దేశంలోని అత్యంత కీలకమైన ‘నోవా కఖోవ్కా’ ఆనకట్టను రష్యా పేల్చివేసింది! దీంతో వరద దిగువ ప్రాంతాల్ని ముంచెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని అధికారులు ఖాళీ చేయించారు. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి వెళ్లాలంటే నీపర్ నదిపై ఉన్న ఈ డ్యాం కీలకం. అందువల్లే ఆనకట్టను కూల్చేశారని వార్తలు వెలువడ్డాయి. ఆనకట్ట కూల్చివేతను రష్యా అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, క్రీమియా ఆక్రమణపై ద హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది.