శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 26, 2020 , 15:21:16

మ‌హ‌మ్మారి క‌రోనా.... వ‌ణుకుతున్న యూరోప్‌

మ‌హ‌మ్మారి క‌రోనా....  వ‌ణుకుతున్న యూరోప్‌

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా వ‌ణికిస్తున్న‌ది.  ఆ వైర‌స్ .. మ‌హమ్మారిగా మారింది. చైనాలో ఇప్ప‌టికే ఆ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 2700 దాటింది. ఇక ఆ ప్రాణాంత‌క వైర‌స్ ఛాయ‌లు.. ఇప్పుడు యూరోప్ దేశాల‌ను ఊపిరాడ‌నివ్వ‌డంలేదు. అనేక యూరోప్ దేశాల్లో.. క‌రోనా తొలి కేసులు న‌మోదు అయ్యాయి.  ఆస్ట్రియా, క్రొయేషియా, స్విట్జ‌ర్లాండ్, ఇట‌లీ దేశాల్లోనూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. లాటిన్ అమెరికా దేశ‌మైన బ్రెజిల్‌లో కూడా క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. ఇటలీలో 323 కేసులు న‌మోదు కాగా, అందులో 11 మంది మ‌ర‌ణించారు. జ‌ర్మ‌నీలో 18, ఫ్రాన్స్‌లో 14, యూకేలో 13, స్పెయిన్ 7 కేసులు న‌మోదు అయ్యాయి. 

ద‌క్షిణ కొరియాలో వైర‌స్ సోకిన వారి సంఖ్య 1261కి చేరుకున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 12 మంది మ‌ర‌ణించారు. హాంగ్‌కాంగ్ ప్ర‌భుత్వం త‌మ ప్ర‌జ‌లకు ఓ ఆఫ‌ర్ ఇచ్చింది. దేశంలో ఉన్న 70 ల‌క్ష‌ల మందికి త‌లా ఒక‌రికి వెయ్యి డాల‌ర్లు ఇచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.  18 ఏళ్ల వ‌య‌సు నిండిన వారికి ఈ డ‌బ్బును అందించ‌నున్నారు. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు.   స్పెయిన్‌లోని ఓ దీవి హోట‌ల్‌లో క‌రోనా సోకిన వారిని నిర్బంధించారు. వందల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను ఆ హోట‌ల్‌లో లాక్ చేశారు. బ్రిట‌న్‌లో అనేక స్కూళ్ల‌ను మూసివేశారు. ద‌క్షిణ కొరియాలో 20 మంది సైనికుల‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేల్చారు. ఇరాన్‌లో 139 కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించారు.


logo