ది హేగ్: కొవిడ్ కట్టడికి ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన మాత్రకు యూరోపియన్ యూనియన్ ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది. కొవిడ్‌పై తమ మాత్ర సమర్థంగా పనిచేస్తున్నదని, దవాఖానలో చేరడాన్ని, ప్రాణముప్పును 90 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఫైజర్ ఇటీవలే వెల్లడించింది. ఒమిక్రాన్‌పైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తెలిపింది.