Indigo Plane Diverted : ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలను దారి మల్లించడం చూశాం. ఈసారి అగ్నిపర్వతం (Volcano) కారణంగా ఇండిగో ఫ్లైట్ అకస్మాత్తుగా తన దిశను మార్చుకోవాల్సి వచ్చింది. కేరళలోని కన్నూర్ నుంచి సోమవారం ఇండిగోకు చెందిన 6E 1433 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. అయితే.. కాసేపటికే ఇథియోపియాలో 10 వేల ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలైందనే వార్త తెలిసింది. దాంతో.. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులు భద్రత దృష్ట్యా విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు.
విమాన ప్రయాణికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 6E 1433 ఇండిగో విమానాన్ని అగ్నిపర్వతం విస్ఫోటనంతో దారి మళ్లించాల్సి వచ్చింది. ఇథియోపియాలోని ‘హేలీ గుబ్బి’ అనే అగ్నిపర్వతమే అందుకు కారణం. పది వేల ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ వోల్కనో ఆదివారం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దాంతో.. ఆ ప్రాంతం నుంచి లావా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అధిక వేడి.. ఇతర వాయువులు ఆ ప్రాంతంలో అలజడి రేపాయి.
❗️🌋🇪🇹 – Ethiopia’s Hayli Gubbi Volcano Awakens After 10,000 Years
In a stunning geological event, Ethiopia’s Hayli Gubbi volcano—long dormant in the remote Danakil Depression of the Afar Rift—erupted explosively for the first time in recorded history on November 23, 2025.
The… pic.twitter.com/bZby4sAuOC
— 🔥🗞The Informant (@theinformant_x) November 24, 2025
అగ్నిపర్వతం బద్ధలైనందున ఇథియోపియా మీదుగా విమానాల రాకపోకలు శ్రేయస్కరం కాదని భారత ఏవియేషన్ నిపుణులు సూచించారు. దాంతో, అహ్మదాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీ, జైపూర్ నుంచి విమానాల రాకపోకలు జరిగేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
#TravelUpdate We are closely monitoring the volcanic activity in Ethiopia and its potential impact on flight operations in nearby regions. Our teams will continue to assess the situation in compliance with international aviation advisories and safety protocols and take necessary…
— Akasa Air (@AkasaAir) November 24, 2025
‘ఇథియోపియాలో బద్ధలైన అగ్నిపర్వతం తీవ్రత, దాని ప్రభావాలను నిశితంగా గమనిస్తున్నాం. అంతర్జాతీయ ఏవియేషన్ అధికారులతో కలిసి పరిస్థితిని అంచనా వేస్తున్నాం. తిరిగి విమాన రాకపోకలకు సంబంధించి అవసరమైన జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాం. ఆకాశ ఎయిర్‌కు ప్రయాణికుల భద్రతనే తొలి ప్రాధాన్యం’ అని ఆకాశ ఎయిర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.