వాషింగ్టన్: మనకు తెలిసిన వినికిడి పరికరాలను వినియోగించటంలో సామాజికంగా, ఆర్థికంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వీటిని పరిష్కరించే ఉద్దేశంతో ఒక ైస్టెలిష్ లుక్తో తయారుచేసిన ‘స్మార్ట్ గ్లాసెస్’ (న్యూయాన్స్ ఆడియో గ్లాసెస్) ఇప్పుడు అమెరికాలో అందుబాటులోకి రాబోతున్నాయి.
వీటి అమ్మకాలకు ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) తాజాగా ఆమోదం తెలిపింది. 2025లో అమెరికా, యూరప్దేశాల్లో వీటి అమ్మకాలు మొదలవుతాయని ‘ఈజిలియర్ లక్సోటికా’ కంపెనీ తాజాగా వెల్లడించింది. ‘రెండు కీలకమైన ఇంద్రియాలను మెరుగుపర్చే ‘స్మార్ట్ గ్లాసెస్’ తీసుకురావాలనుకున్నాం. వినికిడి పరికరాల తయారీలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది’ అని కంపెనీ సీఈవో చెప్పారు.