Doug Emhoff | వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డఫ్ ఎమ్హోఫ్ తనకు గతంలో వివాహేతర సంబంధం ఉండేదని అంగీకరించారు. తన మొదటి వివాహ సమయంలో తాను వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు చెప్పారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. డఫ్ పిల్లలు చదువుకున్న పాఠశాలలో టీచర్‌గా పని చేసిన మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉండేది.
ఫలితంగా ఆమె 2009లో గర్భవతి అయ్యారు. అయితే ఆమెకు గర్భస్రావం జరిగింది. వీరిద్దరి సంబంధం బయటపడటంతో డఫ్, మొదటి భార్య కెర్స్టిన్ విడిపోయారు.