South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
South Carolina | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా (South Carolina) రాష్ట్రంలో అమెరికా ఇంధనశాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో రేడియేషన్ లీకై ఉండవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి (Emergency) ని ప్రకటించారు.
South Carolina : అగ్రరాజ్యం అమెరికా (USA) లో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా (South Carolina) రాష్ట్రంలో అమెరికా ఇంధనశాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. దాంతో రేడియేషన్ లీకై ఉండవచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి (Emergency) ని ప్రకటించారు. సౌత్కరోలినాలోని సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ గదిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయని వెల్లడించారు.
అయితే రెండు గంటల్లోనే ఆ మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లేబరేటరీ ప్రవేశమార్గాలను మూసివేసినట్లు తెలిపారు. సమీపంలో రాకపోకలను నిలిపివేశామని చెప్పారు. పరిస్థితిని సమీక్షించి ల్యాబ్ మార్గాలను తెరుస్తామని, రాకపోకలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

