రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది.
- భారత్‌కు పంపేందుకు రష్యా ఓకే
- ముగిసిన ప్రధాని మోదీ రష్యా పర్యటన
- మోదీకి ఆ దేశ ప్రతిష్ఠాత్మక పురస్కారం
మాస్కో, జూలై 9: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో ఈ అంశాన్ని భారత ప్రధాని మోదీ లేవనెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకొన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా సైన్యంలో 35-50 మంధి భారతీయలు పనిచేస్తుండొచ్చని విదేశాంగ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 10 మంది తిరిగి భారత్‌కు వచ్చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్‌తో వివాదానికి పరిష్కారం యుద్ధ భూమిలో లభించదని, బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు విజయవంతం కాలేవని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కీవ్‌లోని ఓ చిన్నారుల దవాఖానపై రష్యా క్షిపణి దాడులపై మోదీ మాట్లాడుతూ పిల్లలను చంపడం చాలా బాధాకరమని, గుండెను పిండేస్తున్నదని అన్నారు. కాగా, అంతకుముందు పుతిన్‌ను మోదీ ఆలింగనం చేసుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి చెందిన నాయకుడు ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడిని కౌగిలించుకొన్నారు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
మరో రెండు రష్యా నగరాల్లో కాన్సులేట్లు
ప్రధాని మోదీకి మంగళవారం రష్యా ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్య్రూ ది అపోస్టల్’ను పుతిన్ అందజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఈ గౌరవం ఇచ్చారు. ఈ అవార్డు అందుకొన్న తొలి భారతీయ నేత మోదీనే. రష్యాలోని కజన్, యెకాటెరిన్బర్గ్ నగరాల్లో భారత రాయబార కార్యాలయాలను తెరువనున్నట్టు మోదీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

