వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఆయనకు చెందిన స్పేస్ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ (Starship) విఫలమైంది. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా గురువారం సాయంత్రం 4.37 గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 4 గంటలకు) ఈ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, కరేబియన్ మీదుగా భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో అది పేలిపోయింది. దీంతో దాని శకలాలు కరేబియన్ సముంద్రంలో పడిపోయాయి. పెద్దఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేలిపోయాయి. బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్‌కి తిరిగి చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ స్పందించింది. ప్రయోగం విఫలమవడానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్ విశ్వసనీయతను పెంచిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇదిలాఉంటే.. ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తరువాత స్టార్ షిప్ రాకెట్‌తో తాము కమ్యూనికేషన్ కోల్పోయామని స్పేస్ ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ వెల్లడించారు. కాగా, 232 అడుగుల భారీ రాకెట్ అయిన స్టార్‌షిప్‌లో మొత్తం 33 రాప్టర్ ఇంజిన్లు వాడారు. కాగా, ఈ వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. విజయవంతం కాకపోయిన.. వినోదం మాత్రం గ్యారెంటీ అంటూ అందులో రాసుకొచ్చారు.
Starship upper stage exploded after the Super Heavy booster was successfully caught by the chopstick arms. This was a new version of the rocket. Space X will learn and get it right in a few months. pic.twitter.com/fDiwEK3btu
— Andy froemel (@FroemelAndy) January 16, 2025
Enough with this shit
Stop wasting $ billions on garbage that starts fires
Hire better engineers and PAY THEM!#SpaceX #NASA #Rockets
BNO News: BREAKING: Debris seen… after SpaceX’s Starship falls apart during test flight pic.twitter.com/OG8Fxv9sjZ— #TFIO The Future Is Ours (@Gertrud09084848) January 16, 2025
SpaceX just broke history for a second time, successfully catching its Starship Super Heavy rocket booster in mid-air pic.twitter.com/xiYn4yXSZm
— Historic Vids (@historyinmemes) January 17, 2025
Just want Remind everyone that @SpaceX is developing Worlds biggest, Most Powerful, Fully and Rapidly reusable Rocket. It will take alot of Launch, Failures and time to develop it Completely. It’s not going to be easy. [1/2] pic.twitter.com/jUvWk9AMop
— Starship Camper (@Happycamperin12) January 17, 2025
Success is uncertain, but entertainment is guaranteed! ✨
pic.twitter.com/nn3PiP8XwG— Elon Musk (@elonmusk) January 16, 2025