వాషింగ్టన్, ఆగస్టు 20: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆఖరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు క్యాబినెట్ పోస్టు లేదా ప్రభుత్వంలో ముఖ్యమైన సలహాదారుడిగా తీసుకుంటానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
దీనిపై వెంటనే స్పందించిన మస్క్ .. ‘సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డీవోజీఈ) అని రాసి ఉన్న పోడియం ముందు నిలబడిన ఫొటోను మస్క్ షేర్ చేశారు.
ఇటీవల మస్క్ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేశా రు. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షించేందుకు ‘గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కమిషన్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఇందుకు ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందించారు.