న్యూయార్క్: బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) భాగస్వామి శివన్ జిలిస్‌కు నాలుగవ సంతానం కలిగింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య 14కు చేరింది. నాలుగవ సంతానం కలిగిన జిలిస్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఆ ట్వీట్‌కు లవ్ సింబల్‌ను షేర్ చేశాడు మస్క్. స్పేస్ఎక్స్ సీఈవో మస్క్, న్యూరాలింక్ ఉద్యోగి శివన్ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవలలు కాగా, ఓ కూతురు ఉన్నది. తాజాగా షెల్డన్ లైకర్గస్ పుట్టినట్లు శివన్ తన పోస్టులో చెప్పింది.
కొన్ని రోజుల క్రితం ఆష్లే సెయింట్ క్లెయిర్ అనే మహిళ కూడా మస్క్ వల్ల కుమారుడికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఎంఏజీఏ ఇన్ప్లూయన్సర్ అయిన ఆ 26 ఏళ్ల మహిళ.. మస్క్‌కు 13వ సంతానం కలిగినట్లు ఇటీవల పేర్కొన్నది. ఆ కుమారుడిని ఆర్ఎస్సీ అని కోర్టు పత్రాల్లో తెలిపారు. మస్క్ పాత్రను కన్ఫర్మ్ చేసేందుకు పెటర్నిటీ టెస్టు చేయాలని ఆమె కోరింది. ఆష్లే క్లెయిర్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని న్యూయార్క్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
మస్క్ ఫ్యామిలీలో ఇప్పుడు పిల్లల సంఖ్య 14కు చేరింది. శివన్ జిలిస్‌తో నలుగురు, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో అయిదుగురు పుట్టారు. మ్యూజిక్ స్టార్ గ్రైమ్స్‌తో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. తన వీర్యకణాలను స్నేహితులు, ఆశ్రితులకు మస్క్ దానం చేసిన విషయం తెలిసిందే.
♥️
— Elon Musk (@elonmusk) February 28, 2025