న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా పతనం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కోరారు. మానవ జాతి మనుగడ కోసం ప్రతి మహిళ సగటున 2.7 మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉన్నదని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుపై ఎలాన్ మస్క్ ఈ మేరకు స్పందించారు.
కొందరు అసలు పిల్లలను కనకపోవడం, కొందరు ఒక్క సంతానానికే పరిమితమవుతున్న నేపథ్యంలో పిల్లలు కావాలనుకునే వారు కనీసం ముగ్గురిని కనడం వల్ల ఆ లోటును భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు. మస్క్‌కు ఐదుగురు భార్యలు, 14 మంది సంతానం ఉన్నారు.