కాలిఫోర్నియా : టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఈసీవో ఎలన్ మస్క్ తన కంపెనీ షేర్లను అమ్మేశాడు. సుమారు అయిదు బిలియన్ల డాలర్లకు కొన్ని షేర్లు అమ్ముడుపోయాయి. టెస్లా కంపెనీలోని పది శాతం వాటాను అమ్మాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం తన ట్విట్టర్లో ఓ పోల్ నిర్వహించారు. ట్విట్టర్లో మస్క్‌కు సుమారు 63 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆ పోల్ మస్క్‌కు అనుకూలంగా రావడంతో టెస్లా షేర్లు సుమారు 16 శాతం పడిపోయాయి. కానీ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ విలువ సుమారు ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అయితే టెస్లాలోని 3.6 మిలియన్ల షేర్లను సుమారు 4 బిలియన్ల డాలర్లకు అమ్మేశారు. ఆ తర్వాత మరో 934000 షేర్లను మరో బిలియన్ డాలర్లకే అమ్మేసినట్లు తెలుస్తోంది.