న్యూయార్క్: ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఆ సంస్థ అధినేత ఎలాన్‌మస్క్.. కొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చారు. ఇప్పటివరకు ట్విట్టర్లో బ్లూ టిక్ మాత్రమే ఉండగా, శుక్రవారం నుంచి బంగారు, బూడిద రంగుల్లో కూడా టిక్‌లు ఉంటాయని ట్వీట్ చేశారు. బంగారు రంగు టిక్‌ను కంపెనీలకు, బూడిద రంగు టిక్‌ను ప్రభుత్వ అకౌంట్లకు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఉన్నట్టుగానే బ్లూ టిక్ వ్యక్తులకు (ప్రముఖులు అయినా.. కాకపోయినా) ఇస్తామని చెప్పారు. కాగా, బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించి, ఎలాంటి తనిఖీలు లేకుండా ఇచ్చారు. నకిలీ ఖాతాలు కనిపించడంతో ఆ సేవలను నిలిపివేశారు.