న్యూయార్క్: బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk)తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దిగిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఆ ఫోటోపై సోషల్ మీడియాలో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.
కొన్ని రోజుల క్రితం న్యూయార్క్లో అవార్డు సెర్మనీ జరిగింది. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మెలోనీకి అందజేశారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన ఆ అవార్డు కార్యక్రమంలో పేర్కొన్నారు. నిజమైన, వాస్తవమైన, నమ్మకమైన వ్యక్తి మెలోనీ అంటూ మస్క్ ప్రశంసలు కురిపించారు.
జార్జియా మెలోనీని ఇష్టపడుతానని, ప్రధానిగా ఇటలీ కోసం ఆమె ఎంతో చేశారన్నారు. రాజకీయాల్లో నమ్మకమైన, విశ్వసనీయమైన వ్యక్తులు తక్కువే అన్నారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదని మస్క్ చేసిన పోస్టుకు.. మెలోనీ కూడా తన ఎక్స్ అకౌంట్లో థ్యాంక్స్ తెలిపారు.
We are not dating
— Elon Musk (@elonmusk) September 24, 2024