వాషింగ్టన్ : దేశ వలస వ్యవస్థను సమూలంగా మార్చడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంస్ చేసిన తాజా ప్రయత్నం విమర్శలను ఎదుర్కొంటూ ఉండగా, ఆయన మాజీ మిత్రుడు, ప్రపంచ కుబేరుడు మస్క్ గతంలో వ్యహరించిన రెండు నాల్కల ధోరణి సామాజిక మాధ్యమంలో మళ్లీ చర్చకు వచ్చింది.
అమెరికా అధ్యక్షుడితో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆయన గత ఏడాది మొదట్లో హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించారు. అయితే ఒక్క రోజు తర్వాతే మాటమారుస్తూ అదొక విఫల వ్యవస్థ అని, దానికి భారీ సంస్కరణలు కావాలని అన్నారు. దక్షిణాఫ్రికా దేశస్థుడైన మస్క్ తాను అమెరికాలో ఉన్నానంటే దానికి యూఎస్ వీసా వ్యవస్థే కారణమని ప్రశంసించారు.