బీజింగ్ : అమెరికా వ్యాపారవేత్త ఎలన్ మస్క్(Elon Musk) ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. దేశాధ్యక్షుడు ట్రంప్‌తో వెళ్లిన బృందంలో ఆయన ఉన్న విషయం తెలిసిందే. అయితే అతిథులకు ఆర్గనైజ్ చేసిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఆ సమయంలో మస్క్ ఓ సెలబ్రిటీ అయిపోయారు. ఆయనతో ఫోటో దిగేందుకు చైనీయులు ఎగబడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఇక అక్కడ సర్వ్ చేస్తున్న మహిళా సిబ్బంది కూడా మస్క్‌తో ఫోటో కోసం ప్రయత్నం చేశారు. అయితే మస్క్ తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోను పోస్టు చేసిన గంటల్లోనే దాన్ని 82 లక్షలకు మందికిపైగా చూశారు. ఇంకా ఆ వీడియోకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి.
ఓ టేబుల్ వద్ద కూర్చున్న మస్క్ కోసం చైనా సంపన్నులు కూడా ఆసక్తి చూపారు. అయితే మస్క్ ఆ సందర్భాన్ని ఫుల్ ఎంజాయ్ చేశారు. అటూ ఇటూ చూస్తూ తనతో ఫోటో దిగే వారికి స్మైల్ ఇచ్చారు. కొందరు కుడి వైపు నుంచి, కొందరు ఎడమవైపు నుంచి వచ్చి మస్క్‌తో సెల్ఫీలు దిగారు. ఓ సందర్భంలో టిక్ కుక్ కూడా వచ్చి మస్క్‌తో కలిసి ఫోజు ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఓ చైనీస్ అమ్మాయి.. మస్క్ టేబుల్ వద్దకు వచ్చింది. ఇక మస్క్ ఆ అమ్మాయిని చూడాలా వద్దా అన్న రీతిలో తన లుక్స్‌ను ప్రజెంట్ చేశారు. అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను ఫన్నీ రూపంలో ఆయన తన వీడియోలో పోస్టు చేశారు. రకరకాల ఎమోషన్స్ తన ఫేస్‌లో చూపించారు.
చైనాలో మస్క్ ఓ పాపులర్ ఫిగర్. ఆయనకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది. మస్క్ కంపెనీ టెస్లా కార్లకు అక్కడ ఆదరణ బాగా ఉంది. ఆయన్ను ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తరహాలో కాకుండా పాప్ కల్చర్ ఐకాన్ తరహాలో చూస్తున్నారు. మస్క్ బాడీ లాంగ్వేజ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లు కొందరన్నారు.
— Elon Musk (@elonmusk) May 15, 2026