Elon Musk: సునీతా, విల్మోర్ను రక్షించిన స్పేస్ఎక్స్, నాసాకు థ్యాంక్స్ చెప్పిన మస్క్
Elon Musk: 9 నెలల పాటు స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇవాళ భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఆస్ట్రోనాట్స్ ను రక్షించిన స్పేస్ఎక్స్, నాసా బృందాలకు.. బిలియనీర్ ఎలన్ మస్క్ థ్యాంక్స్ చెప్పారు. అద్భుతమైన వర్క్ చేసినట్లు ఆయన మెచ్చుకున్నారు.
టెక్సాస్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇవాళ భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్.. ఫ్లోరిడా తీరంలో దిగారు. సముద్ర జలాల నుంచి మేఘన్ రికవరీ షిప్.. ఆ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఆస్ట్రోనాట్లను బయటకు తెచ్చింది. ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్ను రక్షించిన స్పేస్ఎక్స్, నాసా బృందాలకు.. బిలియనీర్ ఎలన్ మస్క్(Elon Musk) థ్యాంక్స్ చెప్పారు. అద్భుతమైన వర్క్ చేసినట్లు ఆయన మెచ్చుకున్నారు.
ఓ టీవీ ఇంటర్వ్యూలో మస్క్ స్పందిస్తూ.. వ్యోమగాములు ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరినట్లు చెప్పారు. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియన్సీ అధినేత అయిన మస్క్.. ఆస్ట్రోనాట్స్‌ను రక్షించిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మెచ్చుకున్నారు. ట్రంప్‌ను ప్రశంసిస్తూ భారీ నోట్ రాశారు. ఆస్ట్రోనాట్స్ రెస్క్యూ మిషన్‌కు ప్రియార్టీ ఇచ్చినందుకు, వ్యోమగాముల రిటర్న్ జర్నీ కోసం ఆసక్తి చూపినందుకు ట్రంప్‌ను ప్రశంసించారు.
Congratulations to the @SpaceX and @NASA teams for another safe astronaut return!
Thank you to @POTUS for prioritizing this mission! https://t.co/KknFDbh59s
— Elon Musk (@elonmusk) March 18, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Butch Wilmore
- Elon Musk
- NASA
- SpaceX
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

