వాషింగ్టన్, జనవరి 2: టెస్లా అధినేత, ట్రంప్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్న ఎలాన్ మస్క్ యూకేలో తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన వరుస ట్వీట్లతో బ్రిటన్ ప్రధాని స్టార్మర్పైనా, యూకే ప్రభుత్వ విధానాలపైనా ఆయన విరుచుకుపడ్డారు.
అతివాద (రైట్ వింగ్) నేత టామీ రాబిన్సన్ను విడుదల చేయాలని కోరారు. నైగెల్ ఫరేగ్కు చెందిన రిఫార్మ్ పార్టీ మాత్రమే యూకేను సంరక్షించగలదని పేర్కొన్నారు.