Twitter | ట్విట్టర్ కంపెనీ లీగల్ ఎగ్జిక్యూటివ్ జిమ్ బ్యాకర్ను కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ తొలగించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమార్ హంటర్ బైడెన్‌కు సంబంధించిన ‘ట్విట్టర్ ఫైల్’ ఇటీవల బహిర్గతమైన విషయం తెలిసింది. ఈ క్రమంలో లీగల్ ఎగ్జిక్యూటివ్‌పై చర్యలు చేపట్టారు.
బ్యాకర్ ట్విట్టర్ ఇంక్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్. అతన్ని తొలగించినట్లు ట్వీట్ చేశాడు. బ్యాకర్ గతంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు న్యాయవాదిగా సేవలందించాడు. ఆ తర్వాత ట్విట్టర్లో చేరారు. అయితే, మస్క్ తనను లీగల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నుంచి తొలగించడంపై జిమ్ బ్యాక్ ఇంకా స్పందించలేదు.