ఒంటారియో (కెనడా): మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, టీవీలు సహా ఎన్నో రకాల వస్తువులు ఇప్పటికే స్మార్ట్‌గా మారిపోయాయి. సమీప భవిష్యత్తులో దుస్తులు సైతం ఈ జాబితాలో చేరనున్నాయి. సూర్యరశ్మిని ఉపయోగించి మనల్ని వెచ్చగా ఉంచే స్మార్ట్ ఫ్యాబ్రిక్‌తో సూట్లు, కోట్లు తయారు చేయబోతున్నారు. ఇందుకు అవసరమైన స్మార్ట్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీని వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు ప్రదర్శించారు. సూర్యరశ్మితోపాటు మన శరీరం నుంచి వెలువడే ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చగలిగేలా రూపొందించిన ఈ ఫ్యాబ్రిక్ ధరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. సెన్సర్లను అనుసంధానించుకుని, గుండె లయను, శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించేందుకు స్మార్ట్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగింకోవచ్చని పరిశోధకులు తెలిపారు.