ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులు గురువారం వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ప్రజాకోర్టు నిర్వహించి భారత ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై శుక్రవారం భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు అక్కసు వెళ్లగక్కడానికి ట్రూడో సర్కారు అవకాశం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్థానీ నాయకుడు నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అర్పించిన మరుసటి రోజే ప్రజాకోర్టు నిర్వహణ జరగడం గమనార్హం. గతేడాది నిజ్జర్ హత్య అనంతరం ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.