అంకారా: మూడు శక్తివంతమైన భూకంపాలు తుర్కియేను కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భూకంపాల వల్ల అనటోలియా భూభాగం సుమారు 10 మీటర్లు కిందకు ఒరిగినట్లు ఇటలీ శాస్త్రవేత్త అంచనా వేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ శాస్త్రవేత్త అలెసాండ్రో అమటో దీనిపై ఓ రిపోర్టు రిలీజ్ చేశారు. మధ్యదరా సముద్రం, నల్ల సముద్రం, ఏజియన్ సీ మధ్య ఉన్న భూభాగాన్ని అనటోలియా భూభాగంగా గుర్తిస్తారు. సిరియాతో ఉన్న సరిహద్దు వద్ద .. 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల తుర్కియేతో పాటు సిరియాలోనూ పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.
Turkey, the moment when a father covered his son with his body during a tragic earthquake. As it turned out, this saved his life, the son is alive pic.twitter.com/E5cAV16d0f
— Levandov (@blabla112345) February 9, 2023
సిరియా, తుర్కియే బోర్డర్ వద్ద ఉన్న ఫాల్ట్ లైన్ ఇప్పుడు భూకంప జోన్‌గా మారిందన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 10 మీటర్ల మేర భూమి జరిగినట్లు సెసిమాలజిస్ట్ అమటో అంచనా వేశారు. ట్రాన్స్‌కరెంట్ మూమెంట్ వల్ల భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అనటోలియా ఫాల్ట్ జోన్ సరిహద్దుల్లో భూమి రెండు వైపులా సుమారు 10 మీటర్ల మేర కిందకు జారిందన్నారు. అయితే ఏజియన్ సీ వైపు స్వల్పంగా ఆ భూమి ఒరిగినట్లు శాస్త్రవేత్త తెలిపారు.
Some more heartwarming footage coming out of the Turkey earthquake zone, rescuers we able to free a little friend!
(https://t.co/04q4SYvMUs) pic.twitter.com/8xPUil5gJW— 🥀_Imposter_🕸️ (@Imposter_Edits) February 8, 2023
నేషనల్ జియోలాజికల్ సర్వేస్ ఆఫ్ డెన్మార్క్ అండ్ గ్రీన్‌ల్యాండ్ లో పనిచేస్తున్న సీనియర్ పరిశోధకుడు టీనా లార్సెన్ మరో కీలక విషయాన్ని తెలిపారు. భూకంప నుంచి కలిగిన ప్రకంపనలు డెన్మార్క్, గ్రీన్ల్యాండ్లు కూడా వచ్చినట్లు చెప్పారు. శక్తివంతమైన భూకంపం వచ్చినప్పుడు.. ఆ ప్రాంతం నుంచి ప్రకంపనలు ట్రావెల్ చేస్తాయన్నారు.
More than 76 hours have passed since the #earthquake occurred, we have pulled out hundreds of dead from under the rubble of their destroyed homes in #Jenderes, the situation is still catastrophic with the presence of hundreds of others buried.#Syria pic.twitter.com/FGeVDeOhIq
— The White Helmets (@SyriaCivilDef) February 9, 2023
తుర్కియే భూకంపం వల్ల ఇప్పటి వరకు రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 17 వేల దాటింది. కేవలం తుర్కియేలోనే 14వేలకుపైగా మరణించినట్లు ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు రీసెప్ తయిప్ ఎర్డగోన్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లు జోరుగా జరుగుతున్నా.. ఇంకా శిథిలాల కింద వేలమంది ఉండి ఉంటారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
#Turkey #PrayforSyria #TurkeySyriaEarthquake In some cities in Turkey people are on the streets due to the threat of a new earthquake. pic.twitter.com/oKekHOFsvG
— Mukesh (@Mukesh_shivaya) February 9, 2023