జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో
సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్ సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ ప్రకంపన తీవ్రత ఇండోనేషియా రాజధాని జకార్తా వరకు కనిపించింది.
ఆసుపత్రిలో దాదాపు 20 మంది మరణించారని, కనీసం 300 మంది చికిత్స పొందుతున్నారని పియాంజూర్ పాలన అధికారి హెర్మన్ సుహెర్మాన్ పేర్కొన్నారు. చాలా భవనాలు నేలమట్టమయ్యాయని, పెద్ద మొత్తంలో భవనాలకు పగుళ్లు బారాయని తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ఇండోనేషియా వాతావరణ సంస్థ అధిపతి ద్వికోరిటా కర్నావతి పేర్కొన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా ప్రస్తుతానికి భవనాల వెలుపల ఉండాలని కోరుతున్నామన్నారు.
#BREAKING#Indonesia 🇮🇩 Widespread damage and chaos in #Cianjur from 5.6 Mw (updated) #earthquake in West Java.
Nearly 20 people have been killed and at least 300 injured in an earthquake that rattled Indonesia’s main island of Java, #Indonesian #earthquake pic.twitter.com/WG0Vy6lDxj
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 21, 2022
#BreakingNews #Beaking#WATCH : #Earthquake of 5.6 #magnitude rocks Indonesia’s #Java #island; 20 dead, over 300 #injured#Earthquake #Cianjur #JawaBarat #WestJava #Java #Indonesia #ViralVideo #iNDONESIA #earthquake #Indonesian pic.twitter.com/PdwrdnDmgg
— Harish Deshmukh (@DeshmukhHarish9) November 21, 2022
#earthquake #UPDATE
इंडोनेशिया में भूकंप से 44 लोगों की मौत, 300 घायल !#Indonesia pic.twitter.com/Rcrmxz6f4M— Sunil Patel 🇮🇳 (@sunilpatel139) November 21, 2022