వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఇప్పటికీ పట్టిపీడిస్తూనే ఉంది. చాలా వరకు దేశాలు ఈ మహమ్మారిని నియంత్రించగలిగినా దాదాపు అన్నిదేశాల్లో కొత్తగా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని కరోనా పరిస్థితిపై న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డెన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో రిపోర్టర్లు ఆమెను కరోనా పరిస్థితి గురించి ప్రశ్నలు అడిగారు. ఇలా ఒక జర్నలిస్టు ప్రశ్నించిన తరుణంలోనే ప్రధాని మీటింగ్ నిర్వహిస్తున్న ప్రాంతం ఒక్కసారిగా దడదడలాడింది. వెల్లింగ్టన్లో ప్రధాని మీటింగ్ జరుగుతుండగా ఈ భూకంపం వచ్చింది.
అక్కడకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ భూకంపం నుంచి తేరుకున్న వెంటనే చిన్నగా నవ్విన ప్రధాని జకిండా తనను ప్రశ్నించిన రిపోర్టర్‌తో మాట్లాడారు.
‘‘సారీ, కొంచెం ఫోకస్ దెబ్బతింది. మీ ప్రశ్నను మళ్లీ రిపీట్ చేస్తారా?’’ అని అడిగారు. మీటింగ్ ముగింపులో ఆమె మాట్లాడుతూ వేదికపై ఉన్న ఉపప్రధాని గ్రాంట్ రాబర్ట్సన్ ఇప్పటికీ వచ్చింది భూకంపం అని నమ్మడం లేదని, బలంగా గాలి వీయడంతోనే అలా జరిగిందని అనుకుంటున్నారని జకిండా పేర్కొన్నారు.
ఇలా చిన్న చిన్న భూకంపాలు రావడం న్యూజిల్యాండ్‌లో మామూలే. అందుకే చాలా మంది ఇలాంటి భూకంపాలను సీరియస్‌గా తీసుకోరు.
Jacinda Ardern keeping her cool as an earthquake rattled the North Island around 10 minutes ago. @1NewsNZ pic.twitter.com/TSfiplDtMb
— Andrew Macfarlane (@andrewmacfnz) October 21, 2021