Early Aging | వాషింగ్టన్: వృద్ధాప్యం అనేది కాలక్రమంగా జరిగే ప్రక్రియ అని సంప్రదాయ సిద్ధాంతాలు చెప్తున్న మాట. కానీ అది నిజం కాదని స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తేల్చారు. అణువుల కూర్పు పరంగా మనిషి శరీరం 44, 60 ఏండ్ల వయసులో తీవ్ర మార్పులకు లోనవుతుందని గుర్తించారు.
దేహంలో అణువులు, సూక్ష్మజీవులు పెరగడం లేదా తగ్గడం లేదా తీవ్రమైన మార్పులకు లోనవడం లాంటి అంశాలు శరీరంలో మార్పులకు దోహదం చేస్తాయన్నారు. అందుకే ఈ రెండు దశల్లో కొంత మందికి అకస్మాత్తుగా వృద్ధులమైపోయినట్టు లేదా ఆరోగ్యం క్షీణించినట్టు అనిపిస్తుందని వివరించారు.