సినలోవా: మెక్సికోలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం సర్వసాధారణమే. అక్కడ నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే, గత సోమవారం పోలీసులకు, డ్రగ్స్ ముఠాకు మధ్య జరిగిన కాల్పుల ఘటన మాత్రం గత ఘటనల కంటే భిన్నమైనది.
ఎందుకంటే, గత సోమవారం ఓ డ్రగ్స్ ముఠా అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నదని సమాచారం అందుకున్న పోలీసులు వారి కాన్వాయ్‌ని గుర్తించి అటవీ ప్రాంతంలో అడ్డగించారు. దాంతో డ్రగ్స్ ముఠా సభ్యులు, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులపైకి కాల్పులు జరుపుతూనే డ్రగ్స్ ముఠా సభ్యులు తమ వాహనాలతో సహా అక్కడి నుంచి పారిపోయారు.
అయితే, పోతూపోతూ ఒక ట్రక్కును అక్కడే వదిలేసి వెళ్లారు. పోలీసులు ఆ ట్రక్కు దగ్గరికి వెళ్లి పరిశీలించగా దానిలో భారీగా మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు కనిపించాయి. ఆ తర్వాత ట్రక్కు వెనక్కి వెళ్లి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ట్రక్కు వెనుక భాగంలో ఒక రాయల్ బెంగాల్ టైగర్ కట్టేసి ఉంది. షాక్ నుంచి తేరుకున్న పోలీసులు టైగర్‌తో సహా ట్రక్కును సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ట్రక్కులో టైగర్ కూర్చుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Surreal 🤦🏻
Culiacán, Sinaloa. Mexico.A tiger was rescued when law officers were chasing 3 vehicles.
No arrests were made,everybody ran away.
Cartel people ? Regular criminals ?
How many more animals ?The abuse against animals is absolute, everywhere.
I’m sorry for the tiger. pic.twitter.com/BDe6YGL9BA
— AR (@AR36098813) April 4, 2023