Hurricane Milton | హెలెన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది. మిల్టన్ తుఫాన్ (Hurricane Milton) ఫ్లోరిడా (Florida)ను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ప్రభావితులయ్యారు. ఈ గాలుల ధాటికి వేల సంఖ్యలో చెట్లు నేల కూలాయి.. రోడ్లు దెబ్బతిన్నాయి.
ఇక హరికేన్ తీరం దాటే సమయంలో ఫ్లోరిడాను భీకర గాలులు చుట్టుముట్టాయి. ఓ రోడ్డుపై రెండు కార్లు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. ఇక అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లు గాలుల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న వాహన దారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబధించిన భయానక వీడియో (terrifying video) ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ తుఫాను ధాటికి 30 లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెయింట్ పీటర్స్బర్గ్ నివాసితులకు నీటి సరఫరా ఆగిపోయింది. మిల్టన్ తుఫాను కారణంగా ఫ్లోరిడా తీరంలో వరదలు సంభవించాయి. దక్షిణ ఫ్లోరిడాను భారీ వర్షాలు, టోర్నడోలు బుధవారం నుంచి ముంచెత్తాయి.
15 కౌంటీల్లోని సుమారు 70 లక్షల మంది ప్రజలను తప్పనిసరిగా నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా 1900 విమానాలను రద్దు చేశారు. దాదాపు 1,000 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,600 మంది సిబ్బందితో కూడిన 23 రెస్క్మూ టీమ్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కాగా, పశ్చిమ ఫ్లోరిడాలో రెండు వారాల క్రితం హెలెన్ తుఫాన్‌కు 230 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Also Read..
Open Fire | బొగ్గు గనిలోని ఉద్యోగులపై సాయుధుడి కాల్పులు.. 20 మంది మృతి
Israel Strike | బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృత్యువాత
Exhibition Grounds | ఎగ్జిబిషన్ మైదానంలో దుర్గా మాత విగ్రహం ధ్వంసం..