ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి .. దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాల్లో .. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. అయితే పారిస్లో ఉన్న ఆయన .. గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకోనున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి యునిస్ నాయకత్వం వహించనున్నారు. 24 గంటల్లో లేదా మరికొన్ని గంటల ఆలస్యంతో.. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని యాంటీ డిస్క్రిమినేషన స్టూడెంట్ మూవ్మెంట్ కోర్డినేటర్ నహిద్ ఇస్లామ్ తెలిపారు. దేశాధ్యక్షుడితో జరిగిన మీటింగ్లో డాక్టర్ మహమ్మద్ యునిస్ పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు నహిద్ వెల్లడించారు.